కల్లూరు: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తేల్చి చెప్పారు. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13వ తేదీన కర్నూలు రానున్నట్లు తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కర్నూలు జైలుకు చేరుకుని అక్కడ విరూపాక్షిని పరామర్శించనున్నారని తెలిపారు. జగన్ పర్యటన ఏర్పాట్లపై మంగళవారం కల్లూరులోని తన నివాసంలో జిల్లా ముఖ్యనేతలతో కాటసాని సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మహి ళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజ య మనోహరి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వకర్త కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, ఇన్‌చార్జ్ ఆదిమూలపు సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య, నేతలు అహమ్మద్ అలీఖాన్, మాజీ డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, కల్లూరు అర్బన్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై నాయకులకు కాటసాని దిశానిర్దేశం చేశారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని కాటసాని ఆరోపించారు. కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చివరికి ఎమ్మెల్యేలపై కూడా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు.
● రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి విమర్శించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయన్నారు. వీటిపై స్పందించని ప్రభుత్వం కేవలం వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.
● అక్రమ అరెస్టులు, దాడులతో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని పార్టీ మైనార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. జననేత స్ఫూర్తితో ప్రజలతో కలిసి పోరాటం చేస్తామన్నారు.
● 2029 ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య అన్నారు.
● రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజాస్వామ్య పాలన సాగుతుందా? అని.. కోట్ల హర్షవర్దన్‌రెడ్డి ప్రశ్నించారు. దాడులు, బెదిరింపులకు భయప డేది లేదన్నారు.
రేపు కర్నూలుకు
వైఎస్ జగన్ రాక
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని
రాంభూపాల్‌రెడ్డి


