వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు టీజీపీ లింక్ చానల్ ద్వారా 4 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి రిజర్వాయర్‌లో నీటిమట్టం 254.01 మీటర్లు (833.33 అడుగులు)గా నమోదైంది. ప్రస్తుతం 3.661 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 264.70 మీటర్లు కాగా, స్థూల సామర్థ్యం 16.95 టీఎంసీలు. ప్రస్తుతం క్యాచ్‌మెంట్ ప్రాంతం నుంచి ఎలాంటి నీటి ప్రవాహం లేదు. టీజీపీ లింక్ చానల్ ద్వారానే 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. రిజర్వాయర్ నుంచి ప్రస్తుతం 80 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఇందులో వెలుగోడు, ఆత్మకూరు, నంద్యాల పట్టణాల తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన 60 క్యూసెక్కులు ఆవిరీభవనం, సీపేజ్, ఇతర వ్యవస్థ నష్టాల రూపంలో నమోదవుతున్నాయి. ఇక 1ఎల్, 1ఆర్ కాలువలకు, టీజీపీ మెయినన్ కెనాల్‌కు ప్రస్తుతం నీటి విడుదల లేదు. స్పిల్‌వే ద్వారా అదనపు నీటి ప్రవాహం కూడా లేదు.


