గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత

Aug 10 2026 1:46 AM | Updated on Aug 10 2026 1:46 AM

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: గిరిజనుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలన్నారు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా పోటీ పరీక్షలకు హాజరయ్యే అవకాశాలు లభిస్తాయని, అందువల్ల విద్యార్థులు డిగ్రీ విద్యను పూర్తి చేయడంతో పాటు నిరంతర సాధన, క్రమశిక్షణతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. జిల్లాలో ని 9 ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, 13 ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ఐటీడీఏకు సంబంధించిన పాత ఫిర్యాదులు, విచారణలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం మరింత మెరుగుపరచేందుకు ముగ్గురు డీఎఫ్‌ఓలతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్‌ అభినందించారు. విద్యా ర్థుల నృత్య ప్రదర్శనలో వారి ప్రతిభ, ఉత్సాహం, భావ వ్యక్తీకరణను ప్రశంసిస్తూ, వారికి శిక్షణ అందించిన ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement