శ్రీశైలంటెంపుల్: ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్న వేలాది మంది భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుల సదుపాయం కల్పించినట్లు దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఇవి కై లాసద్వారం నుంచి శ్రీశైలం వరకు నడుస్తాయన్నారు. నందిసర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠం జంక్షన్, మల్లమ్మకన్నీరు, శివాజీస్ఫూర్తి కేంద్రం, రుద్రాపార్క్, సిద్ధరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేట్ సత్రాల మీదుగా తిరిగి నందిసర్కిల్‌కు చేరుకుంటాయని చెప్పారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని శిఖరేశ్వరం నుంచి కూడా ఉచిత బస్సును శ్రీశైలానికి నడుపుతున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని అనుసరించి శుక్రవారం నుంచి 15వ తేదీ వరకు ఆరు ఉచిత బస్సులు, 16 నుంచి 19వ తేదీ వరకు ఎనిమిది ఉచిత బస్సులను నడుపుతామని తెలిపారు.


