సీసీఆర్‌ కార్డులు ఇచ్చి ఏం లాభం? | - | Sakshi
Sakshi News home page

సీసీఆర్‌ కార్డులు ఇచ్చి ఏం లాభం?

Mar 14 2026 7:37 AM | Updated on Mar 14 2026 7:37 AM

సీసీఆర్‌ కార్డులు ఇచ్చి ఏం లాభం?

మాకు ఎలాంటి భూములు లేవు. రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాం. 2025–26 సంవత్సరానికి సంబంధించి 3.75 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాం. ఇందులో పత్తి సాగు చేసి అధిక వర్షాల నష్టాలు మూట కట్టుకున్నాం. కౌలు భూమికి రైతు అంగీకారంతో ప్రభుత్వం సీసీఆర్‌ కార్డు కూడా జారీ చేసింది. కార్డుతో సహా ఆధార్‌, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో అన్నదాత సుఖీభవ కింద సాయం కోసం రైతు సేవా కేంద్రంలో సమర్పించాం. అన్నదాత సుఖీభవ సాయం దక్కలేదు. ఉపయోగం లేని సీసీఆర్‌ కార్డులు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదు. – ఉప్పరి లక్ష్మన్న, తులసాపురం, కర్నూలు మండలం

Advertisement
 
Advertisement
Advertisement