మాకు సొంతంగా సెంటు భూము లేదు. దేవాలయ భూమిని కౌలుకు సాగు చేసుకుంటున్నాం. 2025–26 సంవత్సరానికి 5.90 ఎకరాలకు సీసీఆర్‌సీ కార్డును ప్రభు త్వం జారీ చేసింది. అన్నదాత సుఖీభవ కింద సాయం దక్కుతుందని ఆశించాం. మొదటి, రెండవ విడతల్లో రాలేదు. మూడవ విడత లో కౌలుదారులకు న్యాయం జరుగుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి కలగనప్పుడు ఇక సీసీఆర్‌సీ కార్డులు ఎందుకు జారీ చేస్తున్నట్లు.
– జంగం జంబులింగయ్య,
ఆర్.కొంతలపాడు, కర్నూలు మండలం


