పరీక్షలకు ‘పది’లమైన ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పరీక్షలకు ‘పది’లమైన ఏర్పాట్లు

Mar 12 2026 7:14 AM | Updated on Mar 12 2026 7:14 AM

మాస్‌ కాపీయింగ్‌ లేకుండా చర్యలు

ఏ రోజు ఏ పరీక్ష

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. బాలురు, బాలికలనే తేడా లేకుండా పరీక్ష సమయంలో విద్యార్థులు తమ గ్రామాల నుంచి పరీక్ష కేంద్రానికి ఆర్టీసీ బస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష హాల్‌ టికెట్‌ను చూసిస్తే సరిపోతుంది.

నంద్యాల(న్యూటౌన్‌): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 1 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 130 కేంద్రాల్లో 25,033 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 81.85 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుత విద్యాసం వత్సరంలో 90 శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంగా విద్యాశాఖ నిర్ణయించుకోంది.

బాలురే అధికం

పబ్లిక్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో బాలికల కంటే బాలురే అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 25,033 మంది విద్యార్థులు పరీ క్షలకు హాజరుకానుండగా వారిలో 13,039 మంది బాలురు, 11,994 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టికెట్ల కోసం స్కూళ్లు చుట్టూ తిరగనవసరం లేకుండా వెబ్‌సైట్‌ నుంచి పొందువచ్చు. ప్రశ్నపత్రాలు ఈనెల 10, 11వ తేదీల్లో జిల్లా కేంద్రమైన నంద్యాలకు చేరుకున్నాయి. ఇక్కడ నుంచి మండల కేంద్రాల్లోని పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. పరీక్ష కేంద్రాల సీఎస్‌, డీఓలు, సబ్జెక్టు తేదీల వారీగా విభజించుకొని వాటిని పోలీసుస్టేషన్‌లో భద్రపరుస్తారు.

మెడికల్‌ కిట్లు సిద్ధం

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన వైద్య సిబ్బందితో పాటు మందులను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రంలో ఏఎన్‌ఎంతో పాటు ఆశా వర్కర్‌ను నియమించి ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.

పరీక్ష కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాం. పరీక్షల నిర్వహణకు దాదాపు 1,300 మంది ఇన్విజిలేటర్లు, సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, రాష్ట్ర, జిల్లా స్థాయి అబ్జర్వర్స్‌ పనిచేస్తున్నారు. ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటలకు మాత్రమే విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష రాసే విద్యార్థులంతా 8.30 గంటలలోపే కేంద్రాలకు చేరుకోవాలి.

–జనార్ధన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల

16 ఫస్ట్‌ లాంగ్వేజ్‌

18 సెకండ్‌ లాంగ్వేజ్‌

21 ఇంగ్లిష్‌

23 మ్యాథ్స్‌

25 ఫిజికల్‌ సైన్స్‌

28 బయాజికల్‌ సైన్స్‌

30 సాంఘిక శాస్త్రం

31 సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2

ఏప్రిల్‌ 1 ఆప్షనల్‌/ఇతర సబ్జెక్టు

ఈనెల 16 నుంచి

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు

పోలీసుస్టేషన్‌కు చేరుకున్న

ప్రశ్నపత్రాలు

జిల్లాలో 25,033 మంది విద్యార్థులు

విధులు నిర్వర్తించనున్న

1300 మంది ఇన్విజిలేటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement