నంద్యాలకు చేరుకున్న పది ప్రశ్నాపత్రాలు | - | Sakshi
Sakshi News home page

నంద్యాలకు చేరుకున్న పది ప్రశ్నాపత్రాలు

Mar 11 2026 7:25 AM | Updated on Mar 11 2026 7:25 AM

నంద్యాల(న్యూటౌన్‌): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు జిల్లాకు స్టాక్‌ పాయింట్‌ కేంద్రానికి చేరుకున్నట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని స్టాక్‌ పాయింట్‌గా ఉన్న శ్రీచైతన్య పాఠశాల నుంచి జిల్లాలోని 12 రూట్లు ఏర్పాటు చేసి పేపర్‌–1 ప్రశ్నాపత్రాన్ని తరలించారు. ఈ రూట్లలోని పోలీస్టేషన్లలో భద్రత పరిచేందుకు డీఈఓ పర్యవేక్షణలో రూట్‌ ఆఫీసర్లతో పోలీసు స్టేషన్లకు పంపించినట్లు తెలిపారు. అలాగే బుధవారం పేపర్‌–2 ప్రశ్నాపత్రాన్ని కూడా ఏర్పాటు చేసిన రూట్లలో పోలీసు స్టేషన్‌లో భద్రపరిచేందుకు పంపడం జరుగుతుందన్నారు. వీరి వెంట విద్యాశాఖ అధికారులు రఘురామిరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, ఎంఈఓ–2 శివప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

నందికొట్కూరు: పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం కల్పిస్తామని కర్నూలు జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. మంగళవారం పట్టణంలోని సబ్‌జైల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు సూచనలు చేశారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైన ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. సదుపాయలు, భోజనాలు గురించి ఆరా తీశారు. అనంతరం కోర్టులో పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈయన వెంట జూనియర్‌ సివిల్‌ జడ్జి దివ్య, సబ్‌జైల్‌ ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, న్యాయవాది వెంకటేశ్వర్లు, వైద్యు లు ప్రవీణ్‌కుమార్‌, స్థానిక మండల్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ వారు, తదితరులు ఉన్నారు.

ముస్లిం సామూహిక

వివాహాలకు దరఖాస్తులు

నంద్యాల (వ్యవసాయం): పట్టణంలోని అంజుమన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పేద ముస్లిం ఉచిత సామూహిక వివాహాలకు దర ఖాస్తు చేసుకోవాలని సంస్థ అధ్యక్షుడు నష్యం మహమ్మద్‌ ఖుదూస్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 19వ తేదీన ముస్లిం యువతీ యువకులకు అంజుమన్‌ షాదీ ఖానాలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఏప్రిల్‌ 12 తేదీలోపు అంజుమన్‌ షాదీఖానాలో ఉచిత దరఖాస్తులు పొంది ఆధార్‌ కార్డు, పాస్‌ ఫొటోలు రెండు, యువతి బ్యాంక్‌ పాస్‌ బుక్‌ జిరాక్స్‌ అందజేయాలన్నారు. ఏప్రిల్‌ 19వ తేదీ జరిగే వివాహ వేడుకల్లో నిఖా ఖర్చులతో పాటు వధువుకు రూ.50 వేల చెక్కును అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని పేద ముస్లిం తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

14న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి నోట్‌ ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో షెడ్యూల్‌ ప్రకారం గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య మరియు వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పను లు – ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష కొనసాగుతుందన్నారు. సమావేశాలకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సంబంధిత స్థాయీ సంఘాల సభ్యులు, అధికారులు తమకు కేటాయించిన సమయానికి హాజరు కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement