వెలుగోడు: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద వెలుగోడు రిజర్వాయర్‌లో మంగళవారం చేప పిల్లలను విడుదల చేశారు. రిజర్వాయర్ ర్యాంప్ వద్ద ప్రజా ప్రతినిధులు, సీడ్ స్టాకింగ్ కమిటీ సభ్యులు అధికారుల సమక్షంలో చేప పిల్లలను విడుదల చేశారు. నంద్యాల జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ జి. హిరా నాయక్ , కర్నూలు జిల్లా డిప్యూటీ డైరెక్టర్, అబ్జర్వర్ డాక్టర్ రంగనాథ్ బాబు, ఉమ్మడి కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. మత్స్యకారుల అభి వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మత్స్యకారులకు వలలు, పుట్టీలు, ఐస్ బాక్స్‌లతో కూడిన రెండు చక్రాల వాహనాలు అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మత్స్య శాఖ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఫిష్ సీడ్ స్టాకింగ్ పాయింట్ అధికారి, ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ కె.బి. భరత్ లాల్ నాయక్ తెలుగు సంఘం అధ్యక్షుడు మద్దయ్య, వెంకట సుబ్బన్న, మాజీ సర్పంచ్ ఎంఏ అబ్దుల్ కలాం, రమణ, వీఆర్వో సురేష్ నాథ్ రెడ్డి, మత్స్య సహాయకులు చంద్ర, లోకేష్, ఆనంద్ గౌడ్, శిరోమణి, శివ, అనోక్, నరేంద్ర, విజయ్ కుమార్ పాల్గొన్నారు.


