బేతంచెర్ల: ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో సిమెంట్‌నగర్ వాసుల్లో భయాందోళన నెలకొంది. గల్ఫ్ దేశాల్లో సిమెంట్‌నగర్ గ్రామానికి చెందిన కార్మిక కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రధానంగా కువైట్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో క్షిపణి దాడులు జరగడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులను బయటకు వెళ్ల వద్దని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అక్కడ సుమారు 70 మంది వరకు సిమెంట్‌నగర్ యువకులు ఉన్నట్లు సమాచారం. గతంలో పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ నైపుణ్యం పొందిన పలువురు సిమెంట్ నగర్ వాసులు ఉపాధి కోసం కువైట్, దుబాయ్, సౌదీ, బెహరిన్, ఖతర్, అబుదాబీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
చంద్రగ్రహణం ఎఫెక్ట్
మహానంది: కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం మహానంది ఆలయ తలుపులు మూతబడ్డాయి. ఉదయం 8 గంటల వరకు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్ల దర్శనాలు కొనసాగాయి. అనంతరం గ్రహణం కాలం కావడంతో ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ.. శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండ రామాలయం, వినాయకనంది, ఆంజనేయ స్వామి, నవగ్రహ ఆలయాలు, గరుడనంది ఆలయాల తలుపులను శాస్త్రోక్త పూజలతో మూసేశారు. రాత్రి ఏడు గంటలకు సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం రాత్రి 9.30 గంటల వరకు భక్తులకు దర్శనాలను కల్పించారు. ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్‌రెడ్డి, ఆలయ ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలల్లో నేటి నుంచి విజ్ఞాన వారోత్సవాలు
కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నేటి(బుధవారం) నుంచి విజ్ఞాన వారోత్సవా లు నిర్వహించాలని డీఈఓ ఎల్.సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు విజ్ఞాన వారో త్సవాలు నిర్వహించాలన్నారు. నేడు పాఠశాల స్థాయిలో, 4, 5వ తేదీల్లో ఆయా మండల కేంద్రాల్లో ఎంఈఓ సూచించిన పాఠశాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. 6వ తేదీన జిల్లా స్థాయి విజ్ఞాన వారోత్సవాలు ఐఏఎస్‌ఈ కాలేజీ (సిల్వర్‌జూబ్లీ కాలేజీ ఆవరణలోని ప్రభుత్వ బీఈడీ కాలేజీ)లో నిర్వహిస్తామన్నా రు. సందేహాల నివృత్తికి జిల్లా సైన్స్ అధికారి 87901 11331ను సంప్రదించాలన్నారు.
25న డాక్ అదాలత్
కర్నూలు(అర్బన్): డాక్ అదాలత్ కార్యక్రమాన్ని ఈనెల 25న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్ధన్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డివిజన్ పరిఽ దిలోని తపాలా కార్యాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతరత్రా సమస్యలను డాక్ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు.


