వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు | - | Sakshi
Sakshi News home page

వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Mar 4 2026 7:22 AM | Updated on Mar 4 2026 7:22 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలోనే అధిక ఉష్ణోగ్రతలు కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతుండటం గమనార్హం. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు, నంద్యాలలో గరిష్ట 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22.4 ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకా శం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.

వడదెబ్బతో రైతు మృతి

జూపాడుబంగ్లా: తాటిపాడుకు చెందిన వంగల కృష్ణారెడ్డి (62) అనే రైతు వడదెబ్బ తో మృతి చెందాడు. మొక్క జొన్న పొలానికి మంగళవారం నీళ్లు కట్టుకొంటూ కుప్పకూలిపోయాడు. కృష్ణారెడ్డిని ఆటో లో ఇంటికి, అక్కడి నుంచి 108లో నందికొట్కూరు ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య లక్ష్మీదేవి తాటిపాడు సర్పంచ్‌ కాగా మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement