శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్‌ దారుణం | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్‌ దారుణం

Feb 11 2026 8:33 AM | Updated on Feb 11 2026 8:33 AM

శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్‌ దారుణం

శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్‌ దారుణం

రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకోవడం తగదు

కల్లూరు: శ్రీశైలంలో దర్శనం కోసం శివభక్తులు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని, భక్తులపై పోలీసులతో లాఠీ చార్జీ చేయించడం దారుణమని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కల్లూరులోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, ఫిష్‌ ఆయిల్‌ కలిసిందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డుమాంసం కొవ్వు, పంది కొవ్వు కలవలేదని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్‌డీడీబి, ఎన్‌డీఆర్‌ఐలు స్పష్టం చేశాయన్నారు. ఈ ల్యాబుల రిపోర్టులను సీబీఐ, సిట్‌ తన చార్జీషీటులో పొందుపరిచిందన్నారు. అయినా సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు, కోట్లాడి మంది వెంకటేశ్వరస్వామి భక్తులు ఛీదరించుకుంటున్నారన్నారు. తన ఆరోపణలు తప్పని ల్యాబ్‌ టెస్టుల్లో తేలినప్పటికి ఇప్పటికీ ప్రజలకు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పలేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటే దేవుడు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. నీచ ప్రచారాలు, అబద్ధాలను కట్టిపెట్టి భక్తుల మనోభావాలను టీడీపీ నాయకులు గౌరవించాలన్నారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు గాజుల శ్వేతారెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, సాన శ్రీనివాసులు, నాయకులు ఎ. హనుమంతురెడ్డి, ఎన్‌. గోపాల్‌రెడ్డి, శివారెడ్డి, తిరుపాల్‌, శ్రీనివాసులు, రమణారెడ్డి, శివశంకర్‌రెడ్డి, సుంకన్న, భీమశంకర్‌రెడ్డి, సాయి, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement