వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Feb 10 2026 8:01 AM | Updated on Feb 10 2026 8:01 AM

వెట్ట

వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి భీమునిపాడుకు జ్వరమొచ్చింది

నంద్యాల: వెట్టి చాకిరీ రహిత జిల్లాగా నంద్యా లను తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రామునాయక్‌ అన్నారు. సోమవారం వెట్టి చాకిరీ చట్టం 1976 రద్దు చేసి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కలెక్టరేట్‌లో పోస్టర్లను డీఆర్‌ఓ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్‌ మాట్లాడుతూ వెట్టి చాకిరీ అనేది ఒక రకమైన బలవంతపు శ్రమ అని, దీనిలో ప్రజలు అప్పు తీర్చడానికి పని చేయవలసి వస్తుందన్నారు. ఇవి ప్రజలను దోపిడీ, పేదరికం, నియంత్రణ అనే వలయాల్లో చిక్కుకునేలా చే స్తుందన్నారు. ఎవరైనా వెట్టి చాకిరీలో చిక్కు కుని ఉన్నారని తెలిస్తే మండల రెవెన్యూ అధికారి, జిల్లా మేజిస్ట్రేట్‌, కార్మిక శాఖ అధికారికి నివేదించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఉమామహేశ్వరి, జిల్లా కన్వీనర్‌ కరీముల్లా, కో కన్వీనర్లు ఫిలిక్స్‌, అక్బర్‌ బాషా, న్యాయ సలహాదారులు సయ్యద్‌ అమీర్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

చౌడేశ్వరిదేవికి రూ. 20.90 లక్షల ఆదాయం

బనగానపల్లె: నందవరంలో వెలసిన చౌడేశ్వరిదేవి ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా ఆలయానికి రూ.20.90 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతేడాది నవంబర్‌ 12వ తేదీ నుంచి ఈనెల 8వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించారు. ఈ లెక్కింపులో 17 గ్రాముల బంగారు, 560 గ్రాముల వెండి ఆభరణాలు వచ్చిన్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆల య పర్యవేక్షణాధికారి హరిశ్చంద్రరెడ్డి, ఆలయ చైర్మన్‌ పీవీ నాగార్జునరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.

50 మందికి పైగా జ్వర పీడితులు

కోవెలకుంట్ల: మండలంలోని భీమునిపాడు ఎస్సీ కాలనీని విష జ్వరాలు వణికిస్తున్నాయి. కాలనీలో పారిశుద్ధ్య లోపంతో ఇటీవల కాలంలో విష జ్వరాలు ప్రబలడంతో కాలనీవాసులు మంచం పట్టారు. కాలనీకి చెందిన సామేల్‌, హరికృష్ణ, ఇంద్రకుమార్‌, అంజలి, గౌసియా, ఓబులేసు, అకి రాతోపాటు మరో 40 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వర పీడితులు కోవెలకుంట్ల పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకుంటున్నారు. వేసవికాలం ప్రారంభం కావడంతో కాలనీలో మురుగునీరు కారణంగా దోమల స్వైర విహారంతో జ్వరాలు ప్రబలిన ట్లు బాధితులు తెలిపారు. పంచాయతీ అధికారు లు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో జ్వరాలు అధికమయ్యాయని వాపోతున్నారు.

ఊరూరా భక్తిపారవశ్యం

రుద్రవరం: అహోబిలేశుడి పారువేట ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉత్సవమూర్తులు జ్వాలా నరసింహుడు, లక్ష్మీ నరసింహస్వాములు పల్లకీలో కొలువై మందలూరు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఉత్సవ మూర్తులకు ఘనస్వాగతం పలికారు. భక్తులంతా పెద్దసంఖ్యలో స్వాముల వారిని చూసేందుకు తరలి వచ్చారు.

నేటితో ముగియనున్న ప్రాక్టికల్‌ పరీక్షలు

కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. గత నెల 27న మొదలైన వొకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మూడు స్పెల్స్‌లో నిర్వహించారు. ఈ నెల 1వ తేది నుంచి మొదలైన జనరల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు రెండు స్పెల్స్‌లో నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగిన పరీక్షలకు 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షలకు 1,566 మందిల్లో 1546 మంది హాజరయ్యారు. మద్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,341 మందిలో 1,321 మంది హాజరయ్యారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి 
1
1/2

వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి 
2
2/2

వెట్టి చాకిరీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement