ఊరూవాడా.. సుగ్గిబాట
గుంటూరు వలస వెళుతున్న
చిర్తనపల్లి
గ్రామస్తులు
ఎమ్మిగనూరుటౌన్/హొళగుంద: ఉపాధి పనులు లేక పోవడంతో ప్రజలు వలస వెళ్తూ గ్రామాలు ఖాళీ అవు తున్నాయి. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాలతో పాటు కోసిగి, కౌతాళం, హొళగుంద మండలాల్లోని గ్రామాల నుంచి ప్రజలు భారీగా దూర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు. గుంటూరులో మిరప కోత పనులు ఉండటంతో కుటుంబాలతో సహా వెళ్తు న్నట్లు చిర్తనపల్లి గ్రామస్తులు తెలిపారు. పనులు పూర్తయిన తరువాత తిరిగి స్వగ్రామానికి వస్తామన్నారు.
ఖాళీ అయిన ఎస్సీ కాలనీ
హొగుంద మండలం నెరణికి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన కూలీలు సోమవారం రాత్రి మూటామల్లె సర్దుకుని వలస వెళ్లారు. గ్రామంలో ఉపాధి పనులు జరగకపోవడం, మెట్ట భూములు, ఇతర వ్యవసాయ పొలాల్లో పనులు లేక పోవడంతో గుంటూరుకు వెళ్తున్నట్లు కూలీలు చెప్పారు. పిల్లాపాపలతో కలిసి వెళ్తున్నామని, గ్రామంలోనే పనులు కల్పించాలని కోరుతున్నారు.


