● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పులకించిన భక్తజనం ● నేడు మయూరవాహనంపై స్వామిఅమ్మవార్ల దర్శనం | - | Sakshi
Sakshi News home page

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పులకించిన భక్తజనం ● నేడు మయూరవాహనంపై స్వామిఅమ్మవార్ల దర్శనం

Feb 11 2026 8:33 AM | Updated on Feb 11 2026 8:33 AM

● హంస

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పులకించిన భక్తజనం ● నేడు మయూరవాహనంపై స్వామిఅమ్మవార్ల దర్శనం

ఇల కై లాసం.. బ్రహ్మోత్సవ శోభితం

శ్రీశైలంటెంపుల్‌: ఇలకై లాసమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీభ్రమరాంబికతో కలసి మల్లికార్జునుడు హంసవాహనంపై దర్శనమివ్వగా స్వామిఅమ్మవార్లను కన్నులారా దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. శ్రీగిరి క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మారుమోగుతోంది. శ్రీశైల పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు హంసవాహనసేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్దగల అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను హంసవాహనంపై అధిష్టింపజేసి ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా హారతులు ఇచ్చారు. మంగళవాయిద్యాలు మార్మోగగా, భక్తుల శివనామస్మరణతో హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రదక్షిణ చేయించారు. అనంతరం పరివార దేవతామూర్తులకు ప్రత్యేక కర్పూర నీరాజనాలు సమర్పించి గ్రామోత్సవాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ప్రారంభించారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హంసవాహనాధీశులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించి ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

శ్రీశైలంలో నేడు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గోరోజు బుధవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు మయూరవాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం మయూరవాహనంపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు. అలాగే ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక దేవస్థానం, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

శ్రీశైలం.. భక్తజనసంద్రం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భ్రమరాంబాసమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామిఅమ్మవార్లకు జరిగే వాహనసేవలు కన్నులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించి తరిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, కృష్ణమ్మ ప్రత్యేక వాయనం సమర్పిస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. క్షేత్ర పరిధి ఎటుచూసినా భక్తజనంతో నిండిపోయింది. నల్లమల అటవీప్రాంతం నుంచి 40 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ భక్తులు హరోం హరా శంకరా అంటూ మల్లన్న చెంతకు చేరుకుంటున్నారు. సామాన్య భక్తులకు ఆలయ క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన1
1/5

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన2
2/5

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన3
3/5

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన4
4/5

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన5
5/5

● హంసవాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement