కర్నూలు: మాస్టర్స్ క్రీడల్లో జిల్లా పోలీసు శాఖకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత నెల 30, 31వ తేదీల్లో 35 – 45 సంవత్సరాల వయస్సు విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాప్(ఎస్‌ఏపీ) లీగ్ మాస్టర్స్ క్రీడలలో జిల్లా పోలీసు శాఖకు చెందిన ఆర్‌ఎస్‌ఐ మహేశ్వర రెడ్డి, కానిస్టేబుల్ శివకుమార్‌లు పాల్గొని పథకాలు సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలైన వీరు గురువారం జిల్లా పోలీసు కార్యాలయం చేరుకుని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ మెడల్స్, శాలువాతో సన్మానించి అభినందించారు. ఆర్‌ఎస్‌ఐ మహేశ్వరరెడ్డి 800 మీటర్ల పరుగుపందెంలో బంగారు పతకం, 1500 మీటర్ల పరుగుపందెంలో వెండి పతకం సాధించారు. అలాగే ట్రాఫిక్ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శివకుమార్ లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం సాధించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ జావేద్, మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి, సెక్రెటరీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.


