వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

Feb 11 2026 8:33 AM | Updated on Feb 11 2026 8:33 AM

వెనుక

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

కొలిమిగుండ్ల: పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యే దృష్టిసారించి పాస్‌ మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఈఓ జనార్దనరెడ్డి తెలిపారు. అవుకు మండలంలోని రామాపురం, కొలిమిగుండ్ల మండలంలోని బెలుం, కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాలు, మోడల్‌ స్కూల్‌, కస్తూర్బా పాఠశాలలను మంగళవారం తనిఖీ చేశారు. జిల్లాలో 27 వేల మంది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరు కాబోతున్నారని చెప్పారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదవాలని సూచించారు.

తుది ఎంపిక జాబితా విడుదల

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలులోని స్టేట్‌ క్యా న్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మెడికల్‌ ఫిజిసిస్ట్‌, ఓటీ అసిస్టెంట్‌, అనెస్తీషియా టెక్నీషియన్‌ అభ్యర్థుల తుది ఎంపిక జాబితా ఫేస్‌–2 విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 జనవరి 29న జారీ చేసిన నియామక నోటిఫికేషన్‌ 01/2024కు సంబంధించి ఈ పోస్టులను 1:2 రేషియో పద్ధతిన లిస్ట్‌ తయారైందన్నారు. జాబితా కర్నూలు, నంద్యాల జిల్లాల ప్రభుత్వ వెబ్‌సైట్స్‌, కర్నూలు మెడికల్‌ కాలేజి వెబ్‌సైట్‌లలో(-h-tt pr://k ur noo .a p.go-v.i n, htt pr:// na nd ya .a p.g-o-v.i n, htt pr://k ur noo med-ica co efe.a-c.i n) అప్‌లోడ్‌ చేశామన్నారు. ఎంపికై న అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, నకలుతో ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు ప్రిన్సిపల్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీ కార్యాలయంలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు.

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.08 కోట్లు

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్రస్వామి కొలువైన శ్రీమఠం హుండీ ఆదాయం లెక్కించగా రూ.3,08,37,571 సమకూరింది. మంగళవారం శ్రీమఠం రాజాంగణ భవనంలో జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 21 రోజుల హుండీ కానుకలు లెక్కించారు.అందులో నగదు రూపేణా రూ.2.98, 13,571, నాణేలా రూపంలో రూ.10,24,000 వచ్చినట్లు మేనేజర్‌ శ్రీనివాసరావు వివరించారు. అలాగే 13 గ్రాముల బంగారం, 1080 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు మేనేజర్‌–2 వెంటేష్‌ జోషి, ఏఏఓ మాధవశెట్టి తెలిపారు.

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి 1
1/1

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement