ముక్కోటి ఏకాదశికి ముస్తాబు
బేతంచెర్ల: ఉమ్మడి జిల్లాలో వైష్ణవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మంగళవారం స్వామి, అమ్మవార్లను భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేలా ప్రత్యేక క్యూలైన్లు, తగిన ఏర్పాట్లు చేసినట్లు ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామి, అమ్మవర్లాకు జరిపే శాంతి కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు వేదికను రంగురంగుల షామియానాలు, పూలతో అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచణం, స్వామి, అమ్మవార్లకు లక్ష తులసిదళార్చన, స్నపన తిరుమంజనం, సుదర్శన హోమం, బలిహరణం, మహానివేదన, మంత్ర పుష్ప సమర్పణం, తీర్థ ప్రసాద వినియోగం చేశారు.


