రోడ్డెక్కిన వేదన!
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ప్రతి సోమవారం ప్రజల అవస్థలకు ఈ దృశ్యం అద్దం పడుతోంది. గత ప్రభుత్వంలో ఎలాంటి సమస్య వచ్చినా గ్రామాల్లోనే సచివాలయంలో పరిష్కారం లభించేది. ఇప్పుడు ప్రతి చిన్న సమస్యకు ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజలు కిలోమీటర్ల దూరం వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్‌కు చేరుకుంటున్నారు. కలెక్టరేట్ ఆవరణలోనే కాకుండా ఇలా రోడ్డు మీదకు బారులు తీరి వినతిపత్రాలను రాసుకుంటున్న దృశ్యాలను చూస్తే టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఏ స్థాయిలో సమస్యలను ఎదుర్కొంటున్నారో అర్థమవుతోంది. వినతులు ఇవ్వడమే కానీ, పరిష్కారం లభించక ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
రోడ్డెక్కిన వేదన!


