గంజాయి విక్రేతల అరెస్ట్
నందికొట్కూరు: గంజాయి విక్రయిస్తే రౌడీషీట్ ఓపెన్ చేయడం ఖాయమని టౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. స్థానిక రాయల్ గ్రీన్ సిటీ వెంచర్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఆత్మకూరు పట్టణం, దుద్యాల రోడ్డులోని పాత నవాజ్ కట్టకు చెందిన కావేటి నాగశేషాద్రి, నందికొట్కూరు వాల్మీక్ నగర్‌కు చెందిన షేక్ మసూద్, కుమ్మరి హరినాథ్, శాతనకోట గ్రామానికి చెందిన అనంత చిన్మయనంద గౌడ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కావేటి నాగశేషాద్రి నుంచి 20 గంజాయి ప్యాకెట్లు (750 గ్రాములు), రూ.3 వేలు నగదు, సెల్‌ఫోన్, షేక్ మసూద్ నుంచి 80 ప్యాకెట్లు (530 గ్రాములు) సెల్‌ఫోన్, కుమ్మరి హరినాథ్ నుంచి 50 ప్యాకెట్లు (300 గ్రాములు) సెల్‌ఫోన్, అనంత చిన్మయనందగౌడ్ నుంచి 80 ప్యాకెట్లు (520 గ్రాములు). సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకునట్లు సీఐ తెలిపారు. సర్కిల్ పరిధిలో ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే రౌడీషీట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఎస్‌ఐ చంద్రశేఖర్, ఏఎస్‌ఐ రామచంద్ర, సిబ్బందితో కలిసి దాడులు చేసి గంజాయి విక్రేతలను పట్టుకున్నట్లు వెల్లడించారు.


