యాగంటిశ్వరుని హుండీ ఆదాయం లెక్కింపు
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన ఉమా మహేశ్వరస్వామి దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు కార్యక్రమం సోమవారం ఆలయ ఈఓ పాండు రంగారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. హుండీల్లోని మొత్తం కానుకలను లెక్కించగా రూ.29,58,535 నగదు, 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 160 గ్రాముల వెండి ఆభరణాలు వచ్చినట్లు ఈఓ పాండురంగారెడ్డి తెలిపారు. పర్యవేక్షణ అధికారి జనార్దన్, ఉపసర్పంచ్ బండి బ్రహ్మానందరెడ్డి, శ్రీరాములు, భరతుడు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మహిళ ఆత్మహత్య
దొర్నిపాడు: ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లి గ్రామానికి చెందిన రామసుబ్బమ్మ (50) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు. గత రెండు రోజులుగా కొడుకు ప్రతాప్ తల్లి పేరిట ఉన్న ఎకరం భూమిని తన పేరిట రాసివ్వాలని వేదిస్తున్నాడు. భూమిని రాసిస్తే తమ జీవనం ఎలా అని తల్లి వాదించేంది. ఈ విషయమై మనస్తాపానికి గురైన ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.


