సంక్షోభంలో సర్కారు విద్య
నంద్యాల(న్యూటౌన్): సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు సురేష్‌కుమార్ విమర్శించారు. ఆదివారం స్థానిక నేషనల్ పీజీ కళాశాలలో యూటీఎఫ్ నాల్గవ జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్నీ నిర్వీ ర్యం చేస్తుందన్నారు. ఉపాధ్యాయుడి బోధనా సమయాన్ని హరిస్తూ బోధనేతర కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారన్నారు. వినూత్న పద్ధతులు అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఉపాధ్యాయులను వేధిస్తుందని విమర్శించారు. విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. కూటమి ప్రభు త్వం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే లక్ష్యమని అంటూ ప్రభుత్వ విద్యకు పాతర వేస్తుందని దుయ్యబట్టారు. జిల్లా యూటీఎఫ్ అధ్యక్ష పీవీ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలన్నా రు. 2022 జూలై నుంచి 12వ పీఆర్సీని అమలు చేయాల్సినప్పటికీ రెండేళ్లు అవుతున్నా ఊసేలేదన్నారు. ఇప్పటి వరకు రూ.8500 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.30 వేల కోట్లు చెల్లింపులపై స్పష్టత లేద న్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, యూటీఎఫ్ రాష్ట్ర సభ్యులు సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, సత్యప్రకాశం, ఐజ య్య, నాగస్వామి, నాయక్, సుజాత, బాబాఫకృద్దీన్, రామ్మోహన్, రామకృష్ణుడు, అరవిందకుమార్, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.


