శ్రీమఠం.. భక్త జనసంద్రం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయం గురువారం భక్తులతో కిక్కిరిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. గ్రామ దేవత మంచాలమ్మకు ఉదయాన్నే అభిషేకం, కుంకుమ ఆర్చన, నైవేద్యం సమర్పించి మహామంగళ హారతి చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. కల్పతరు క్యూలైన్ , శ్రీ మఠం మధ్వ కారిడార్‌లో భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు విహరించారు.


