400 క్వింటాళ్ల శనగ నిల్వలు
గత ఏడాది నుంచి శనగకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేదు. క్వింటా రూ. 5 వేలు ధర దాటకపోవడంతో రెండేళ్ల నుంచి 400 బస్తాల దిగుబడులను గోదాములో భద్రపరుచుకున్నాను. ఈ ఏడాది రబీ సీజన్‌లో 60 ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 18 వేలు కౌలు చెల్లించి మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకుని 90 ఎకరాల్లో జేజే–11, పూలేజి, మరో రకానికి చెందిన శనగ పంట సాగు చేశాను. గత ఏడాది శనగలు అమ్ముడబోక, ఈ ఏడాది శనగసాగుకు పెట్టుబడుల కోసం అవస్థలు తప్పడం లేదు. – గోవిందరెడ్డి, రైతు,
గుంజలపాడు, కోవెలకుంట్ల మండలం
రెండేళ్ల నుంచి వివిధ రకాల పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో ధర లేదు. ఈ ఏడాది రబీ సీజన్‌లో జొన్న, మినుము, పప్పుశనగ పంటలు సాగు చేశాను. ఆయా పంట దిగుబడులకు ధర అంతంత మాత్రంగానే ఉండగా వాటి నుంచి వచ్చే దినుసులకు మాత్రం మార్కెట్‌లో రెట్టింపు ధర పలుకుతోంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులనే వ్యాపారులు జర్మినేషన్ చేసి వాటిని దినుసులుగా మార్చి మార్కెట్‌లో విక్రయిస్తుండటంతో రైతులకు నష్టం చేకూరుతుండగా వ్యాపారాలు లాభాలు గడిస్తున్నారు.
– రాజేష్, రైతు, జోళదరాశి,
కోవెలకుంట్ల మండలం
400 క్వింటాళ్ల శనగ నిల్వలు


