ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు
నందికొట్కూరు: ఖైదీలందరికీ ఉచిత న్యాయవాది కల్పించే వెసులుబాటు ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. పట్టణంలోని సబ్‌జైల్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. న్యాయవాదిని నియమించుకోలేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. సబ్‌జైల్‌లో నెలకొన్న సమస్యలుంటే న్యాయవాదుల దృష్టికి తీసుకురావచ్చాన్నారు. ఆన్‌లైన్ నంబరు 15100కు తెలపవచ్చాన్నారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, సబ్‌జైల్ సూపరింటెండెంట్ రఘునాథరెడ్డి, మెడికల్ ఆఫీసర్ జక్కి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీమఠంలో
సినీనటుడు రిషబ్‌శెట్టి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మండల కేంద్రంలో శ్రీమద్వ కారిడార్‌లో శ్రీ మఠం అధికారులు సంప్రదాయం ప్రకారం వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చన చేసి మంగళ హారతి చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వాముల మూలబృందవనాన్ని దర్శనం చేసుకున్నారు. రిషబ్ శెట్టి కుటుంబ సభ్యులను శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ఆశీర్వదించి, శేషవస్రం, ఫల మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం, శ్రీ రాఘవేంద్రస్వామి జ్ఞాపిక అందజేశారు.
ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు


