ఇళ్లలోనే పత్తి నిల్వలు
● రెండు నెలల క్రితం
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
● ఇప్పటి వరకు కొనింది
5 లక్షల క్వింటాళ్లే
కర్నూలు(అగ్రికల్చర్): రైతుల ఇళ్లలో పత్తి నిల్వలు పేరుకుపోతున్నాయి. గూడూరు మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. తమ గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఉన్నా రైతులు పత్తి అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో ఇంటింటా పత్తి నిల్వలు పేరుకపోయాయి. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. అయితే సీసీఐ పత్తి ఎవరి నుంచి కొంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెండు నెలలుగా సీసీఐ పత్తి కొంటోంది. ఇప్పటి వరకు 18,545 మంది నుంచి కొనుగోలు చేసిన పత్తి 5.67 లక్షల క్వింటాళ్లు మాత్రమే. మార్కెట్‌లో పత్తి ధరలు అతి తక్కువగా ఉండటం వల్ల రైతులు మద్దతు ధరతో అమ్ముకునేందుకే ఆసక్తి చూపుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతుల దగ్గర 50 లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి నిల్వలు ఉన్నాయి. ఈ పరిస్థితి చూస్తే సీసీఐ కొనుగోళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది.


