వైభవంగా గోవిందుడి కల్యాణోత్సవం
డోన్: పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ప్రసన్న మండపంలో గోవిందుని కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. గోవిందమాలదారుల ఆధ్వర్యంలో భక్తజనం మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ , నరసింహాచార్యులు గోదాదేవి శ్రీదేవిలతో గోవిందుడి కల్యాణ క్రతువు నిర్వహించారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో స్వామి పెళ్లి జరపడం ఆనవాయితీగా వస్తోంది. ధర్మకర్తలు పాతాళం సుబ్బారావు. రజినీ కుమారి, శ్రీని వాసరావు గోవింద మాల సమితి ఆధ్వర్యంలో అన్నదాన, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


