శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.4.89కోట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.4,89,38,741 లభించినట్లు దేవస్థానం డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ తెలిపారు. సోమవారం ఉభయ దేవాలయాల హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను చంద్రావతి కళ్యాణ మండపంలో లెక్కించారు. ఈ హుండీల రాబడిని భక్తులు గత 27 రోజులలో సమర్పించారు. అదేవిధంగా కొంత విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించినట్లు డీఈవో తెలి పారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమె రాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు. పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.


