4 క్వింటాళ్లే కొంటాం
ఇప్పటి వరకు కొనుగోళ్లే మొదలు కాక రైతులు కన్నీరు కారుస్తుంటే మురారీ పవన్ ఆగ్రోటెక్ యాజమాన్యం ఎకరాకు 4 క్వింటాళ్లే కొంటామని చెప్పడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. సీసీఐ అధికారులు ప్రకటించినట్లుగా రైతులు ఎకరాలకు 7 క్వింటాళ్లు కొంటారనే ఆశతో ఆ మేరకు సరుకును తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక యాజమాన్యం చేతులెత్తేయడంతో మిగిలిన సరుకును ఏమి చేయాలని లబోదిబోమంటున్నారు. వేలాది రూపాయల బాడుగలు చెల్లించి భారీ వాహనాలతో పత్తిని తీసుకొస్తే ఇక్కడ నిలువునా మోసం చేస్తున్నారని వాపోతున్నారు. అయితే 4 క్వింటాళ్ల మెలికతో కొనుగోలు కేంద్రం యాజమాన్యం మిగిలిన సరుకు అరకొర ధరతో కొనుగోలుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. వీరికి సీసీఐ కూడా వంత పాడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్తి కొనుగోలు చేయనప్పుడు కేంద్రాన్ని ఎందుకు ప్రారంభించారని, ఇక్కడికి వచ్చాక సాకులు చెబితే లారీల బాడుగలు, కూలీ ఖర్చులకు ఎక్కడి నుంచి తెచ్చేదని ప్రశ్నిస్తున్నారు.


