మహిళలు మోసపోయారు
చంద్రబాబు ప్రభుత్వంలో సున్నా వడ్డీ జాడలేదు. పొదుపు మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళల సంక్షేమం లక్ష్యంగా వైఎస్సార్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, జగనన్న తోడు, కళ్యాణమస్తు వంటి పథకాలు అమలు అయ్యాయి. నేడు మహిళలకు ఒక్క పథకం అమలు కావడం లేదు. ఆడబిడ్డ నిధి పేరుతో మోసం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు వస్తే పొదుపు మహిళలే అవసరం అవుతున్నారు. ఆయన మాటలు నమ్మి మోసపోయామని మహిళలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు.
– పి లక్ష్మీదేవి, మాజీ అధ్యక్షురాలు,
ఉమ్మడి జిల్లా మహిళా సమాఖ్య


