ఆడబిడ్డల కోసం మహాశక్తి పథకాన్ని తీసుకువస్తాం. వారి జీవి
కర్నూలు(అగ్రికల్చర్): మహిళా సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్య ఒక్కటంటే ఒక్కటీ లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ.18,750 ప్రకారం ఐదేళ్లు చెల్లించింది. వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్నే ఆడబిడ్డనిధి పేరుతో అమలు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నెలకు రూ.1,500 ప్రకారం ఏడాదికి రూ.18,000 చెల్లిస్తామని ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో ఆరు లక్షల కుటుంబాలను మినహాయించినా తొమ్మిది లక్షల కుటుంబాల్లో 18 ఏళ్లు పైబడిన మహిళలు ఇద్దరు వరకు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 18 లక్షల మంది మహిళలు ఆడబిడ్డనిధి పథకానికి అర్హులవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర్ర అయినప్పటికీ ఈ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో మహిళల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది.
అప్పల ఊబిలో
పొదుపు మహిళలు
స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ ఆధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని పక్కన పెట్టడంతో పొదుపు మహిళలపై వడ్డీభారం పడుతోంది. రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం వల్లనే మహిళలు బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందారు. 2024–25 సంవత్సరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 35 వేల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.2500 కోట్ల వరకు లింకేజీ రుణాలు ఇచ్చారు. 2025–26లో ఇప్పటికే రూ.1500 కోట్ల వరకు బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలు పొందారు. సంఘాలకు బ్యాంకులు గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణాలు పొందుతున్నారు. సున్నా వడ్డీ జాడ లేకపోవడంతో మహిళలపై వడ్డీ భారం పడుతోంది. లింకేజీ రుణాలపై మహిళలు 15 శాతం వరకు వడ్డీ భరిస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి.... ఆచరణలో జరుగుతున్నది మరొకటి కావడంతో మహిళల ఆందోళన అంతా ఇంతా కాదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు వంటి కార్యక్రమాలను ఐదేళ్లు నిర్విగ్నంగా చేపట్టింది. ప్రస్తుతం ఎలాంటి సంక్షేమ పథకాలు లేకపోవడం, వడ్డీ భారం పడుతుండటంతో పొదుపు సంఘాల నుంచి బయటికి వచ్చేందుకు మహిళలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
అభివృద్ధి ..అధోగతి
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమన్‌లెడ్ ఎంటర్ ప్రైజెస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఇది కేవలం కాగితాల మీదనే కనిపిస్తోంది. 2024–25లో 5750 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలనేది లక్ష్యం. మహిళలు 2024–25 ఏడాదికి ముందే ఏర్పాటు చేసుకున్న యూనిట్లను కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రౌండింగ్ చేశారు. మహిళల అభ్యున్నతికి ఇతోధికంగా తోడ్పడే సోలార్ డ్రైయర్లకు మంగళం పలికారు. మహిళా సంక్షేమ కార్యక్రమాలు 2025–26 ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా కుదేలయ్యాయి. మహిళల కోసం కేంద్రం లక్‌పతి దీదీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచరణలో కనిపించడం లేదు.
మహిళా సంక్షేమానికి ‘చంద్ర’ గ్రహణం
అమలుకాని ‘ఆడబిడ్డ నిధి’ దిక్కేలేని సున్నా వడ్డీ రుణాలు
చంద్రన్న బీమాకు మంగళం కాగితాలపైనే ‘లక్‌పతీ దీదీ’
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు
ఆడబిడ్డల కోసం మహాశక్తి పథకాన్ని తీసుకువస్తాం. వారి జీవి


