సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
నేను మ్యాథ్స్‌బీ పరీక్షకు హాజరయ్యాను. గణితమంటే నాలో చాలా భయం ఉండేది. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే భయం లేదు. ఇది నా భవిష్యత్తుకు మంచి పునాది. – ప్రతీక్, 8వ తరగతి,కర్నూలు
స్పెల్‌బీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇంగ్లిష్‌లో కష్టమైన పదాలకు అర్థాలు తెలిశాయి. విద్యార్థులకు చిన్నతనం నుంచే ఇలాంటి పరీక్షలు రాయించడం ద్వారా వారిలోని భయాన్ని తొలగించవచ్చు.
– జయకృష్ణ, టీచర్
నాకు స్పెల్లింగులు రాయడంలో చాలా ఇబ్బందిగా ఉండేది. వాటిని పలికే విధానంపై గందరగోళం ఉండేది. నేను స్పెల్‌బీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లిషు అంటే భయం పోయింది.
–జె.అనిసపర్హిన్, ఏడో తరగతి బనగానపల్లె
నేను ఇంగ్లిషులో మంచి పట్టు సాధించేందుకు స్పెల్‌బీ ఉపయుక్తంగా ఉంది. ఎన్నో నేర్చుకున్నా. భవిష్యత్తులో ఇంగ్లిషు సబ్జెక్ట్ అంటే భయపడను. నాకు ఏకాగ్రత పెరిగింది.
– సమన్విత, ఏడో తరగతి, కర్నూలు
నేను ముందుగా సాక్షికి థ్యాంక్స్ చెబుతున్నా. నేను మ్యాథ్స్ బీ పరీక్షకు హాజరయ్యాను. మూడో దశకు వెళ్తానన్న నమ్మకం ఉంది.
– యశస్వి, 8వ తరగతి, కర్నూలు
కర్నూలు(సెంట్రల్): సాక్షి, అరేనా వన్ స్కూలు ఫెస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కర్నూలు నగరంలోని రవీంద్ర విద్యానికేతన్‌లో ఆదివారం నిర్వహించిన సెమీఫైనల్ పరీక్షలకు 121 మంది విద్యార్థులు హాజరయ్యారు. మ్యాథ్స్‌బీతో కష్టమైన సమస్యలను సులభంగా..వేగంగా..కచ్చితత్వంతో సాధించేందుకు ఎంతో ఉపయుక్తమైనట్లు విద్యార్థులు తెలిపారు. స్పెల్‌బీతో ఇంగ్లిషులో కష్టమైన పదాలకు సులభంగా అర్థాలు నేర్చుకున్నారు. ఈ పరీక్షలు తమ భవిష్యత్‌కు మార్గదర్శకంగా నిలుస్తాయని, ఉన్నత తరగతుల్లో రాణించేందుకు ఉపయోగ పడతాయని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
నాలుగు విభాగాలుగా నైపుణ్య పరీక్షలు
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి తరగతుల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే పరీక్షలకు వందలాదిగా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ నేపథ్యాలు ఉన్న విద్యార్థులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిని నైపుణ్యాలను బట్టి రెండో దశకు ఎంపిక చేస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లిషులో నైపుణ్యాన్ని పెంచుకోవాలని, మ్యాథ్స్‌లో పట్టు సాధించాలని సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలను నిర్వహిస్తోంది. 1,2 తరగతుల విద్యార్థులను ఒక్క గ్రూపుగా, 3, 4, 5 తరగతులను విద్యార్థులను రెండో గ్రూపుగా, 6,7 తరగతుల విద్యార్థులను మూడో గ్రూపుగా, 8, 9, 10వ తరగతుల విద్యార్థులను నాలుగో గ్రూపు వర్గీకరించి పరీక్షలు నిర్వహిస్తారు. రెండో దశలో ఎంపికై న విద్యార్థులకు రీజినల్ స్థాయిలో, అందులో ఎంపికై న విద్యార్థులకు ఫైనల్ స్థాయిలో పోటీ పరీక్షలు ఉంటాయి. ఆదివారం జరిగిన రెండో దశ పరీక్షలకు స్పెల్‌బీ నుంచి 87, మ్యాథ్స్‌బీ నుంచి 34 మంది విద్యార్థులు హాజరయ్యారు.
రెండో దశ పోటీలకు
121 మంది విద్యార్థుల హాజరు
నాలుగు విభాగాలుగా విద్యార్థులను
వర్గీకరించి పరీక్షలు
ఎంతో ఉపయోగమని
సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు
సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన
సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి విశేష స్పందన


