ఆరుగాలం కష్టించినా అన్నదాతకు కాలం కలిసిరావడం లేదు. ఓ వై
ఆళ్లగడ్డ: ఖరీఫ్.. రబీ.. సీజన్ ఏదైనా రైతులకు దుఃఖమే మిగలుతోంది. జిల్లాలో మొక్కజొన్న, మినము కోతలు ముగింపునకు రాగా.. వరి కోతలు మొదలయ్యాయి. కానీ టీడీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో మొక్కజొన్న, వరికి గిట్టుబాటు ధర దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ కింద సుమారు 1.35 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. సాధారణంగా ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపఽథ్యంలో 15 నుంచి 20 క్వింటాళ్లకే పరిమితమైంది. అది సగం మంది రైతులు ధాన్యాన్ని ఆరబోసిన సమయంలో వర్షానికి తడిసి రంగుమారి, ముగ్గిపోయాయి. ఇదే అదునుగా భావించిన దళారులు ధరలను అమాంతం తగ్గించారు. కొనుగోలు కేంద్రాలు లేక పోవడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వారు అడిగినంత ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి. అక్టోబర్ నెలలో కోతలు మొదలయ్యే సరికి రూ. 2,200 ధర పలికింది. ప్రస్తుతం రూ.1,500 నుంచి రూ.1,600 వరకు తగ్గిపోగా.. ఒకనొక సమయంలో తడిచిన ధాన్యాన్ని రూ. 900 నుంచి రూ.1000 లోపే కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులను గ్రామాల్లోకి రాకుండా కమీషన్ ఏజెంట్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తూ రైతులను నిండా ముంచేస్తున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 2,400 ప్రకటిస్తే.. మార్కెట్‌లో క్వింటా రూ.700 నుంచి రూ.1,000 తగ్గించారని పంటను ఎలా విక్రయించాలని రైతలు ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ.35 వేలు ఖర్చు చేసినా 20 క్వింటాళ్ల దిగుబడి అమ్మితే పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఈ లెక్కన ప్రతి రైతు ఎకరాకు కనీసం రూ.15 వేలు చొప్పున నష్టపోతున్నారు. ఈ మేరకు జిల్లా రైతులకు రూ.200 కోట్లకు పైగానే నష్టం వాటిల్లనుంది.
అదనపు తూకం.. ఆగని మోసం
వరి ధాన్యం బస్తా 75 కిలోలు. అయితే తూకం సమయంలో సంచి తూకం అంటూ 2 కిలోలు, మట్టి తరగు కింద 2 కిలోలు, తేమ శాతం కింద మరో 2 కిలోలు లెక్కన దోచుకోవడం ఒక ఎత్తైతే ఎలక్ట్రానిక్ కాటాలో టెక్నిక్‌గా 4 నుంచి 5 కిలోలు మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన బస్తాకు 6 నుంచి 10 కిలోల వరకు అదనంగా లాగుతున్న విషయం బహిరంగ జరుగుతోంది. రవాణా చార్జీలు, హమాలీ కూలీల ఖర్చు నిమిత్తం బస్తాకు మరో రూ. 60 చొప్పున రైతుపైనే భారం మోపుతున్నారు. వీటన్నింటి మూలంగా రైతన్నకు ఈ ఏడాది రమారమీ బస్తాకు రూ. 350 నుంచి రూ. 550 వరకు కోల్పోవాల్సి వస్తోంది.
దిగుబడి దిగజారి.. ధరలు చేజారి
ప్రకటనలకే పరిమితమైన
కొనుగోలు కేంద్రాలు
కల్లాల్లో వాలుతున్న దళారులు
నష్టాల్లో మొక్కజొన్న, వరి రైతులు
ఆరుగాలం కష్టించినా అన్నదాతకు కాలం కలిసిరావడం లేదు. ఓ వై
ఆరుగాలం కష్టించినా అన్నదాతకు కాలం కలిసిరావడం లేదు. ఓ వై


