ఆధ్యాత్మికతతో మానసిక ఒత్తిడి దూరం
నంద్యాల(వ్యవసాయం): యాంత్రిక జీవనంలో ఉండే అధికారులు ఆధ్యాత్మిక త చింతనతో ఒత్తిడి దూ రమై మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చని జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి కబర్ది అన్నారు. జిల్లాలోని పలువురు జడ్జీలు ఆదివారం నవనందుల యాత్ర చేపట్టారు. మొదట ప్రథమనందీశ్వరుడిని దర్శించుకుని అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. వారికి ఆల య ఈఓ ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం వారు అన్నదాన కార్యక్రమాల్లో పాలొన్నారు. ఆలయ నిర్వాహకులు జడ్జీలను శాలువాలతో సత్కరించి స్వామి వారి ప్రతిమలు, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్జిలు కమలాదేవి, అమ్మన్నరాజా, శ్రీవిద్య, రాజేంద్రబాబు, దివాకర్, శ్రీనివాసులు, కర్రి లక్ష్మి, నీలవెంకటశేషాద్రి పాల్గొన్నారు.


