బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు | - | Sakshi
Sakshi News home page

బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు

Nov 17 2025 10:23 AM | Updated on Nov 17 2025 10:23 AM

బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు

బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు

సీమ వెనుకబాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం

ఆదోని అర్బన్‌: బాలికను వేధించడంతో త్రీటౌన్‌ పోలీసులు బీజేపీ నాయకుడు మహేష్‌నాయక్‌ అనే యువకుడిపై ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. త్రీటౌన్‌ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాలు.. మహేష్‌నాయక్‌ అనే బీజేపీకి చెందిన నాయకుడు వేధిస్తున్నాడని శనివారం ఎమ్మెల్యే పార్థసారథికి ఫిర్యాదు చేసేందుకు బాధితులు వచ్చారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు మహేష్‌నాయక్‌ ఎమ్మెల్యే ఇంటి ముందే వారితో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. వెంటనే ఇరువురు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. బాలికను వేధిస్తున్నాడని బీజేపీ నాయకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. మహేష్‌నాయక్‌పై బాలిక తల్లిదండ్రులు దాడి చేసినట్లు మహేష్‌నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

కుంచం వెంకట సుబ్బారెడ్డి

కర్నూలు(అర్బన్‌): రాయలసీమ వెనకబాటు తనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కుంచెం వెంకట సుబ్బారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో శ్రీబాగ్‌ ఒడంబడిక అమలు చేయాలనే డిమాండ్‌పై సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలతో వేలకోట్ల రూపాయాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం జరిగిన శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పలుమార్లు ప్రధానమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రాయలసీమ జిల్లాలో పర్యటించారని, ఏ ఒక్కరికి కూడా శ్రీబాగ్‌ ఒప్పందం గురించి మాట్లాడేందుకు నోరు రాకపోవడం దురదృష్టకరమన్నారు. అనేక రూపాల్లో నష్టపోతున్న రాయలసీమ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తన తుది శ్వాస విడిచేంత వరకు పోరాటం అపబోమన్నారు. రాయలసీమ ఎప్పటికై తే ప్రత్యేకంగా ఉంటుందో అప్పుడే ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. అమరావతి, విశాఖపట్నం ప్రాంతాల్లోనే వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసేందుకు చూస్తున్న పాలకులు రాయలసీమపై కూడా దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌, జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, రాయలసీమ రాష్ట్ర సమితి మైనార్టీ నాయకులు ఖాదర్‌ వలి, బి. ముసికిన్‌, సుభాన్‌, రాజశేఖర్‌, ఖాసీం వలి, మీడియా కోఆర్డినేటర్‌ ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement