కిమ్స్‌ హాస్పిటల్‌ మేనేజర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కిమ్స్‌ హాస్పిటల్‌ మేనేజర్‌ ఆత్మహత్య

Nov 17 2025 10:23 AM | Updated on Nov 17 2025 10:23 AM

కిమ్స

కిమ్స్‌ హాస్పిటల్‌ మేనేజర్‌ ఆత్మహత్య

కర్నూలు: కర్నూలు శివారులోని తుంగభద్ర బ్రిడ్జి దగ్గర కేసీ కెనాల్‌లోకి దూకి కిమ్స్‌ హాస్పిటల్‌ మేనేజర్‌ అన్వర్‌(60) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గత 20 ఏళ్లుగా కిమ్స్‌ హాస్పిటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఆదివారం ఉదయం మాసామసీదు వద్ద కేసి కెనాల్‌లో శవమై తేలాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కర్నూలు అర్బన్‌ తాలుగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కుటుంభ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య పాతిమాతో పాటు కుమారుడు, కూతురు సంతానం. సోదరి కుమారుడు జావీద్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నల్లమల ఘాట్‌లో రోడ్డు ప్రమాదం

మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘాట్‌రోడ్డులోని బొగద దొరబావి వంతెన వద్ద గిద్దలూరు నుంచి వస్తున్న లారీ, నంద్యాల నుంచి వెళ్తున్న కారు మలుపు వద్ద ఢీకొన్నాయి. కారు ముందు భాగం దెబ్బతినింది. కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. కొద్దిసేపు ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న మహానంది, శిరివెళ్ల మండలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

కిమ్స్‌ హాస్పిటల్‌ మేనేజర్‌ ఆత్మహత్య 1
1/1

కిమ్స్‌ హాస్పిటల్‌ మేనేజర్‌ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement