మసీదులో రాజకీయాలు చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసు
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
బొమ్మలసత్రం: నంద్యాల జుమ్మామసీదులో రాజకీయాలు చేస్తున్నది ఎవరోప్రజలకు తెలుసని, అయితే మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూక్ తమపై అబద్ధాలు చెప్పడం తగదని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. నంద్యాలలోని కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీ నాయకుడిగా ఎన్‌ఎమ్‌డీ ఫరూక్ ఇన్నేళ్ల రాజకీయ సుధీర్ఘ అనుభవంలో ఒక్క వ్యక్తికి కూడా మంచి చేసిన దాఖలాలు లేవన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మైనారిటీ పక్షపాతి కాబట్టే తనను మార్కెట్‌యార్డు ఛైర్మన్‌గా చేశారని, తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారన్నారు. అంతే కాకుండా మైనారిటీ మహిళకు మున్సిపల్ చైర్‌పర్సన్ హోదా కల్పించారన్నారు. జుమ్మామసీదు అభివృద్ధిపై మంత్రికి అవగాహనలేదని, అనుచితంగా మాట్లాడటం ఆయన హోదాకు సరికాదన్నారు.


