మరో సారి సర్వే చేయాలి
జిల్లాలో ఎన్యుమరేషన్ మొక్కుబడిగా సాగింది. వరి, మొక్కజొన్న, మినుము, ఉల్లి, మిరప తదితర పంటలకు భారీగా నష్టం జరిగింది. ముఖ్యంగా వరి పంట నేలవాలిపోయింది. నేలకు ఒరిగిన వరిని యంత్రాలతో నూర్పిడి చేసే అవకాశం ఉండదు. కూలీల ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. కేవలం 28 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందనేది వాస్తవం కాదు. మళ్లీ రీ సర్వే జరపాలి. తడిసిన మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. – రామచంద్రుడు,
ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, నంద్యాల


