కేసులను సత్వరమే పరిష్కరించాలి
● జిల్లా ఎప్పీ సునీల్ షెరాన్
గోస్పాడు: పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సిబ్బందికి సూచించారు. గురువారం గోస్పాడు పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని సూచించారు. సమస్యల పట్ల వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి సమస్యల సరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం దృష్టి సారించాలని తెలిపారు. మట్కా, పేకాటతో పాటు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు రాత్రి వేళల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. అనంతరం స్టేనన్ ఆవరణాన్ని పరింశీలించారు. ఆయన వెంట ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు
నంద్యాల: మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మైనర్ డ్రైవింగ్ వలన ప్రమాదాలు, నివారణ, రోడ్డు భద్రతా నిబంధనలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే వారి తల్లిదండ్రుల, సంరక్షకులు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మైనర్ డ్రైవింగ్‌పై 607 కేసులు నమోదు చేసి రూ.30.35 లక్షలు జరిమానా విధించామన్నారు. ట్రాఫిక్ పోలీసులు మైనర్లు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారన్నారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయని, ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు.


