పంట కుళ్లిపోయినా పట్టించుకోలేదు
నోటి కాడికి వచ్చిన పంట నిలువునా గంగమ్మ పాలైంది. కొంత సొంత పొలం, మరికొంత కౌలుతో 30 ఎకరాల్లో నంద్యాల సన్నలు(ఎన్‌డీఎల్‌ఆర్–7) రకం వరి సాగు చేశా. ఎకరాకు రూ.30 నుంచి రూ.35వేల వరకు పెట్టుబడులు పెట్టా. పంట ఏపుగా పెరిగింది. ఒక నెల ఆగితే పంట దిగుబడులు ఇంటికి వచ్చేవి. దీపావళి పండుగ వెళ్లిన వెంటనే వర్షాలు వచ్చాయి. పెద్ద నష్టం జరగలేదనుకున్నాను. ఈలోగా మోంథా తుపాన్ 20 ఎకరాలను ముంచేసింది. తుపాన్ తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాకు రెవెన్యూ, వ్యవసాయాధికారులు ఎప్పుడు వచ్చారో తెలియదు. పొలంలో నీళ్లు ఉండటంతో అధికారులు రాలేకపోయారు. నాకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసి నష్టం పరిహారం అందించాలి.
– సుబ్బారెడ్డి, రైతు, లింగాపురం,
బండిఆత్మకూరు(మం)


