విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం
● ట్రిపుల్‌ఐటీ, ఆర్‌యూ మధ్య ఒప్పందం
కర్నూలు సిటీ: విద్య, పరిశోధన అంశాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాల జీ డిజైన్ అండ్ మ్యాను ఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీ), రాయలసీమ యూనివర్సిటీలు అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు సోమవారం జగన్నాథగట్టులో ఉన్న ట్రిపుల్ ఐటీడీఎంలో ఆ సంస్థఽ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఆర్‌యూ వీసీ ఆచార్య వెంకట బసవరావు సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య, పరిశోధన, ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధిలో పరస్పర సహకారం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పన, ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు, నిర్వహణ, సమావేశాలు, ఆధునాతన ప్రయోగశాలలు, ఆవిష్కరణ, కేంద్రాల స్థాపనలో పరస్పర మద్దతుకు ఈ ఒప్పందం దోహద పడుతుందన్నారు. ఈ భాగస్వామ్యం కింద రెండు సంస్థలు సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్లాక్చెయిన్, క్వాంటం, పోస్ట్ క్వాంటం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎలక్ట్రిక్ వెహికిల్ టెక్నాలజీ, ఇతర అభివృద్ధి చెందుతున్న డోమైన్ల వంటి అత్యాధునిక రంగాల్లో ఉమ్మడి చొరవలకు అవకాశాలను అన్వేషిస్తుందన్నారు. ఈ అవగాహన ఒప్పందం రెండు సంవత్సరాల కాలం పాటు చెల్లుబాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌యూ రిజిస్ట్రార్ విజయ్‌కుమార్, ట్రిపుల్‌ఐటీ డీఎం రిజిస్ట్రార్ రాజ్ కుమార్, అచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
నంద్యాల (వ్యవసాయం): మానసిక ఉల్లాసానికి కార్తీక వనభోజనాలు కార్యక్రమా లు ఎంతో దోహద పడతా యని మూడవ అదనపు సీనియర్ సివిల్ జిల్లా జడ్జి అమ్మన్నరాజ అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కోర్టు ఆవరణంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మహిళా జడ్జీలు, న్యాయవాదులు ఉసిరి, వేప, రావి దేవత వృక్షాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో జడ్జీలు, న్యాయవాదులు నిత్యం ఒత్తిడికి లోనవుతుంటారురాని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం వనభోజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని, రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏసురత్నం, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, కష్ణారెడ్డి, పెద్ది శ్రీనివాసులు, రామసుబ్బయ్య రామచంద్రారావు, వివేకానంద రెడ్డి, ఓబుళరెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, ఏపీపీలు, కోర్టు సిబ్బంది, గుమాస్తాలు తదితరులు పాల్గొన్నారు.
విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం


