
రూ.10 లక్షల విరాళం
శ్రీశైలంటెంపుల్: భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న పలు పథకాలకు భక్తుడు రూ.10లక్షల విరాళాన్ని అందించారు. సోమ వారం కర్నూలుకు చెందిన పి.చిన్నశంకరప్ప శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అన్నప్రసాద వితరణకు రూ.5,00,116, గోసంరక్షణనిధి పథకానికి రూ.5,00,116.. మొత్తం రూ.10లక్షల విరాళ చెక్కును దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. విరాళాలను అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.
పీజీఆర్‌ఎస్‌కు 66 ఫిర్యాదులు
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 66 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడం, పొలం తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి సమస్యలు ఫిర్యాదుల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎస్పీ కార్యాలయ ఆవరణంలో సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ఇచ్చిన ఫిర్యా దులపై చట్ట పరిధిలో విచారణ జరిపి పరిష్క రించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఫిర్యాదులలో కొన్ని....
● బండిఆత్మకూరు మండలం చిన్న దేవళాపురం గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి శాఖమూరి సుబ్బారెడ్డి రూ. 60 లక్షల విలువ చేసే 4000 వరి ధాన్యం బస్తాలు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని నారాయణపురం గ్రామానికి చెందిన చిన్న మద్దిలేటి, రైతులు ఫిర్యాదు చేశారు.
● ఉద్యోగం ఇప్పిస్తానని ఫోన్‌పే ద్వారా రూ.99వేలు తీసుకుని లక్క హరిప్రసాద్ మోసం చేశారని పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన వినోద్ ఫిర్యాదు చేశారు.
ఈనెల 20, 21 తేదీల్లో
రీవెరిఫికేషన్‌కు మరో అవకాశం
కర్నూలు(అగ్రికల్చర్): దివ్యాంగుల పింఛను తీసుకుంటూ రీ వెరిఫికేషన్‌కు హాజరుకాని వారికి డీఆర్‌డీఏ మరో అవకాశం కల్పించింది. సదరం రీ వెరిఫికేషన్‌కు హాజరు కాలేదనే కారణంలో జిల్లాలో 461 మంది దివ్యాంగుల పింఛన్లను ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టింది. వీరికి ఆగస్టు నెల పింఛను పంపిణీ చేయలేదు. రీ వెరిఫికేషన్‌కు హాజరు కాని 461 మందికి ఈ నెల 20, 21 తేదీల్లో సంబంధిత ఆసుపత్రుల్లో డాక్టర్లు రీ వెరిఫికేషన్ చేస్తారని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వైపి రమణారెడ్డి తెలిపారు. ఈ నెల 20న 370 మందికి, 21న 91 మంది దివ్యాంగులకు సంబందిత డాక్టర్లు రీ వెరిఫికేషన్ చేస్తారన్నారు.

రూ.10 లక్షల విరాళం