వినియోగంలోకి రాని సౌకర్య కేంద్రాలు..
భక్తుల సౌకర్యార్థం ప్రసాద్ స్కీంలో శిఖరేశ్వరం వద్ద, హఠకేశ్వరం వద్ద పర్యాటకుల సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వమణకు రెండు, మూడు సార్లు టెండర్లు సైతం పిలిచినా ఎవరు ముందుకు రాలేదు. దీంతో రూ.కోట్లు పెట్టి నిర్మించిన సౌకర్య కేంద్రాలు భక్తులకు వినియోగంలోకి రాకపోగా నిరుపయోగంగా ఉన్నాయి. ఆయా భవనాలను వినియోగంలోకి తీసుకురాకపోతే శిథిలావస్థకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే శిఖరేశ్వరం వద్ద భక్తులు క్షేత్రాన్ని వీక్షించేందుకు వీలుగా వాచ్ టవర్‌ను ఏర్పాటు చేశారు. వాచ్ టవర్ నిర్మాణం కోసం రూ.60 లక్షలు వెచ్చించారు. ప్రస్తుతం వాచ్ టవర్ నిరుపయోగంగా ఉంది.


