విజిలెన్స్ దాడులు
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలో బియ్యం అక్రమ రవాణాపై విజిలెన్స్ పౌరసరఫరాల అధికారులు రెండో రోజు బుధవారం దాడులు కొనసాగించారు. ముగ్గురు ఎండీయూ ఆపరేటర్లు, రెండు రేషన్ షాపులపై దాడులు చేశారు. ఎండీయూ ఆపరేటర్ సాయి మహేష్ (11వ నంబర్)పై దాడి చేయగా ఉండాల్సిన బియ్యం కన్నా 593 కేజీలు తక్కువగా ఉండడంతోపాటు 164 ప్యాకెట్ల చక్కెర తక్కువగా ఉండడంతో 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే రేషన్ షాపు నంబర్ 113పై దాడిచేయగా డీలర్ సుజిత్‌కుమార్ వద్ద ఉండాల్సిన బియ్యం కంటే 86 సంచులు తక్కువగా ఉండడంతో అతనిపై కూడా 6ఏ కేసు నమోదు చేశారు. ఆయా దాడుల్లో డీఎస్‌ఓ రాజారఘువీర్, ఏఎస్‌ఓ రామాంజనేయరెడ్డి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.


