నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్ట వద్ద స్వర్ణాధ్ర–స్వచ్ఛాంధ్ర ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినెల మూడో శనివారం చేపట్టే ఈ కార్యక్రమంతో రాష్ట్రం పరిశుభ్రంగా మారుతుందన్నారు. ఇంటి పరిసరాలతో పాటు పని చేసే ప్రదేశాలు, మన ఆలోచన లు కూడా పరిశుభ్రంగా ఉండాలని ఆయన సూచించారు. ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం– పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం’ అనే థీమ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలన్నారు. అంతకుముందు చెరువుగట్టుపై ఆయన మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలందరి చేత స్వర్ణాధ్ర–స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వర్ణాధ్ర–స్వచ్ఛాంధ్ర జిల్లా ఇన్‌చార్జి, స్పెషల్ అధికారి నివాస్, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసా, మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి, ఆర్‌డీఓ విశ్వనాథ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
విజయానంద్