లిఫ్ట్‌ పనుల్లో పేలుళ్లు.. పొలాల్లో బండరాళ్లు | - | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ పనుల్లో పేలుళ్లు.. పొలాల్లో బండరాళ్లు

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

త్వరలోనే తొలగిస్తాం

అధికారులు స్పందించడం లేదు

పెద్దఅడిశర్లపల్లి : అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (ఏకేబీఆర్‌) లిఫ్ట్‌ పనుల్లో భాగంగా చేపట్టిన బ్లాస్టింగ్‌ సమీప రైతుల పాలిట శాపంగా మారింది. పైప్‌లైన్‌ నిర్మాణం కోసం గుట్టలు, రాళ్లను పేల్చిన సమయంలో పెద్దపెద్ద బండరాళ్లు ఎగిరి చుట్టుపక్కల పంట పొలాల్లో పడ్డాయి. బ్లాస్టింగ్‌ జరిగి ఆరు నెలలు గడుస్తున్నా పొలాల్లో పడిన రాళ్లను తొలగించకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సాగు పనులకు తీవ్ర ఆటంకం

పొలాల నిండా భారీ బండరాళ్లు ఉండటంతో భూమిని దున్నడం, పంటలు సాగు చేయడం కష్టంగా మారిందని రైతులు వాపోతున్నారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు పొలాల్లో తిరిగేందుకు ఆటంకం కలగడంతో పాటు రాళ్లు తగిలి యంత్ర పరికరాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం పడిన రాళ్లను తొలగించాలని సంబంధిత అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఫ నెలలు గడుస్తున్నా

తొలగించని కాంట్రాక్టర్‌

ఫ ఇబ్బందులు పడుతున్న రైతులు

బ్లాస్టింగ్‌ సమయంలో పొలాల్లోకి పడిన రాళ్లను తొలగించేందుకు త్వరలోనే చర్యలు చేపడుతాం. బండరాళ్లు తొలగించాలని పనులు చేపడుతున్న సంస్థ ప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం

– నాగయ్య, డీఈ, ఏఎమ్మార్పీ

బ్లాస్టింగ్‌ సమయంలో మా పొలాల్లో పడిన బండరాళ్లను తొలగించి, భూములను సాగుకు అనుకూలంగా మార్చాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదు. రాళ్ల వల్ల దుక్కి దున్నేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి త్వరితగతిన రాళ్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలి.

– మైలు రాంరెడ్డి, రైతు, పెద్దఅడిశర్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement