నల్లగొండ టౌన్ : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన నల్లగొండలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి.. మేయర్ బుర్రి చైతన్యతో కలిసి పూలమాలవేసి నివాళి అర్పించి మాట్లాడారు. నీతి, నిజాయితీగా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ న్యాయం, ధర్మం కోసం పోరాడిన గొప్ప పోరాట యోధుడు లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. 1942లో మహాత్మాగాంధీ స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ, అనంతరం తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లా్‌ష్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ పరమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, కార్పొరేటర్ మామిడి కార్తీక్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టబోతుల సత్యనారాయణ, మిర్యాల యాదగిరి, దుడుకు లక్ష్మీనారాయణ, ఎదుల్ల శ్రీధర్‌రెడ్డి, చిలకరాజు సతీష్, వెంకట మధు, అంజయ్య, దేవయ్య, యాదయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంజీవ, కొండూరు సత్యనారాయణ, రషీద్, రాపోలు పరమేష్, ముదిగొండ వెంకటేశ్వర్లు, నాగిల్ల మురళి, శేఖర్‌రెడ్డి, రణదీవె, భాస్కర్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


