– గాయం శ్రీధర్‌రెడ్డి, దీప, మఠంపల్లి
మఠంపల్లి : మాది సూర్యాపేట జిల్లా మఠంపల్లి. మాకు ఇద్దరు కుమార్తెలు పెద్దకుమార్తె ప్రణీతారెడ్డి, చిన్నకుమార్తె హర్షితారెడ్డి. మేము గతంలో కువైట్‌లో ఉండే సమయంలో విమానాల్లో ప్రయాణిస్తూ మా కుమార్తెను కూడా ఎయిర్‌హోస్టెస్‌గా చూడాలనుకున్నాం. అందుకే చిన్నకుమార్తె హర్షితారెడ్డిని ఎయిర్‌హోస్టెస్‌ను చేయాలని భావించాం. హర్షితారెడ్డి ప్రాథమిక విద్య మఠంపల్లిలో, ఉన్నత విద్య హైదరాబాద్‌లో సాగింది. మా కుమార్తెను ఎయిర్‌హోస్టెస్‌గా చేయాలనే సంకల్పంతో ఫ్రాంక్‌ఫెన్ యూనిస్ట్రీట్ హైదరాబాద్‌లో ఎయిర్‌హోస్టెస్ డిపోమా కోర్సులో చేర్పించాం. కోర్సు పూర్తిచేసిన హర్షితారెడ్డి ఇంటర్వ్యూలో సెలక్ట్ అయి ఢిల్లీలో ట్రైనింగ్ పొంది ప్రస్తుతం బెంగుళూరు ఎయిర్ ఇండియాలో హోస్టెస్‌గా ఉద్యోగం చేస్తోంది. మా పెద్దమ్మాయి ప్రణీతారెడ్డి జర్మనీలో చదువుకుంటోంది. మాకు మగపిల్లలు లేకపోయినా ఆడపిల్లలే అంతకంటే ఎక్కువగా రాణిస్తూ మాకు ఆనందం కలిగిస్తున్నారు. ఈరోజుల్లో ఆడపిల్లలను ఎవరు తక్కువగా చూడకూడదు. మగ పిల్లలకు దీటుగా అమ్మాయిలు రాణిస్తుంటే ఎంతో ఉప్పొంగిపోతున్నాం.


