నేడు పనిచేయనున్న బ్యాంకులు | - | Sakshi
Sakshi News home page

నేడు పనిచేయనున్న బ్యాంకులు

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

నల్లగొండ టౌన్‌ : బ్యాంకులు ఆదివారం పనిచేయనున్నాయి. డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు సమ్మె చేపట్టారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్ల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో మూడు రోజుల పాటు లావాదేవీలు స్తంభించనున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఖాతాదారుల సౌకర్యం కోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు ఈ నెల 27న (ఆదివారం) పని చేయనున్నాయి. ఖాతాదారులు ఆదివారం బ్యాంకు సేవలను ఉపయోగించుకోవచ్చని ఆయా బ్యాంకుల నుంచి వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతున్నారు.

విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

నకిరేకల్‌ : విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని డీఈఓ సుశీందర్‌రావు సూచించారు. నకిరేకల్‌ మండలం నోముల గ్రామంలోని ప్రాథమిక, జెడ్పీ ఉన్నత పాఠశాలలను శనివారం ఆయన ఆకస్మీకంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం జెడ్పీ హైస్కుల్‌లో కాంప్లెక్స్‌ సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈఓ మేక నాగయ్య, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం మిర్యాల చల్మరాజు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడుర పాక ప్రసాద్‌ ఉన్నారు.

ఎంజీయూకు నాలుగు ఎలక్ట్రిక్‌ వాహనాలు

నల్లగొండ టూటౌన్‌ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నల్లగొండ రీజియన్‌, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమంలో భాగంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి నాలుగు ఎలక్ట్రిక్‌ వాహనాలను శనివారం అందజేసింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ నల్లగొండ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (బీఅండ్‌వో) ప్రియబ్రత మిశ్రా, రీజినల్‌ మేనేజర్‌ పి.పద్మబాబుగౌడ్‌ వాహనాలను విశ్వవిద్యాలయానికి అధికారికంగా అప్పగించారు. విశ్వవిద్యాలయం తరఫున రిజిస్ట్రార్‌ కె.అంజిరెడ్డి వాహనాలను స్వీకరించారు. ఎస్‌బీఐ అందించిన సీఎస్‌ఆర్‌ సహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎస్‌బీఐ అధికారులు, అధ్యాపకులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) శ్రీమన్నారాయణ, చీఫ్‌ మేనేజర్‌ (డీవీఏఎస్‌) కె.శ్రీరామ్‌, మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) అనిల్‌, అన్నెపర్తి శాఖ మేనేజర్‌ చైతన్య, ఆకుల రవి, అరుణప్రియ, హరీష్‌ కుమార్‌, వసంత, శ్రీదేవి, రమణారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, రాంచందర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement