భువనగిరి/నార్కట్‌పల్లి: వివేరా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డికి విశిష్ట అవార్డు లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారుల వెంట భువనగిరి, నార్కట్‌పల్లి కేంద్రాలుగా 42 ఏళ్లుగా ప్రయాణికులు, అధికారులు, వీఐపీలు, సాధారణ ప్రజలకు నాణ్యమైన ఆహారం, వసతి సౌకర్యాలను అందిస్తున్నందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు అందుకున్న అనంతరం సద్ది వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, తమ హోటల్స్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం గౌరవించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గతంలోనూ తమ సేవలకు గాను వివిధ సందర్భాల్లో 9 సార్లు పురస్కారాలు అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేరా హోటల్స్ మేనేజర్ శివ పాల్గొన్నారు.


